అచ్చెన్నాయుడుకు అధిక రక్తపోటు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లుగా ఉన్నట్లు ఆయన వైద్యులకు తెలియజేశారు. దీంతో నిపుణులు పరీక్షించి....

Published : 21 Jun 2020 07:48 IST

గుంటూరు వైద్యం : మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శనివారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లుగా ఉన్నట్లు ఆయన వైద్యులకు తెలియజేశారు. దీంతో నిపుణులు పరీక్షించి అవసరమైన మందులు సిఫార్సు చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో ఈనెల 17న ఆయనకు తిరిగి శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందుల కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని