ఒడిశాలో 5 వేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ పొరుగు రాష్ట్రం ఒడిశాలో కరోనా వైరస్‌ కేసులు ఆదివారం 5 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 304 కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు....

Published : 22 Jun 2020 02:31 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో కరోనా వైరస్‌ కేసులు ఆదివారం 5 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 304 కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,160కి చేరింది. మృతుల సంఖ్య 14కి పెరిగింది. ఈరోజు నమోదైన 304 కేసుల్లో.. 272 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదార్లని, మిగతా 32 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారని అధికారులు చెప్పారు.

అలాగే వీరిని కలిసిన ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. వలసదార్లను ప్రత్యేక క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉంచి పరీక్షలు నిర్వహించగా ఇంత మంది వైరస్‌ బారిన పడ్డారన్నారు. ఇక ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో 3,534 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,607 మంది యాక్టివ్‌ దశలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకూ ఒడిశాలో నమోదైన కేసుల్లో ఈరోజే అధికంగా బయటపడటం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని