57 బాలిక‌ల‌కు క‌రోనా.. ఐదుగురు గ‌ర్భిణులు

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌ ప్ర‌భుత్వ బాలిక‌ల ఆశ్ర‌య గృహంలో 57 మంది బాలిక‌ల‌కు క‌రోనా వైర‌స్ సోకింది.  వీరిలో ఐదుగురు గ‌ర్భ‌వ‌తులు కావ‌డం, మ‌రొక‌రికి హెచ్ఐవీ ఉన్న‌ట్టు తెలియ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ విష‌యం నిజ‌మేన‌ని ధ్రువీక‌రించ‌డంతో అధికారుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

Published : 23 Jun 2020 01:08 IST

కాన్పూర్‌: ఉత్త‌ర్ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌ ప్ర‌భుత్వ బాలిక‌ల ఆశ్ర‌య గృహంలో 57 మంది బాలిక‌ల‌కు క‌రోనా సోకింది. వీరిలో ఐదుగురు గ‌ర్భ‌వ‌తులు. ఒకరు హెచ్ఐవీ బాధితురాలు. ఈ సమాచారం నిజమేనని అధికారులు ధ్రువీక‌రించ‌డంతో స్థానికంగా క‌ల‌వ‌రం మొద‌లైంది.

ప్ర‌స్తుతం ఈ ఆశ్ర‌య గృహాన్ని మూసేసిన ప్ర‌భుత్వం సంబంధిత సిబ్బందిని క్వారంటైన్‌కు త‌ర‌లించింది. ఈ గృహంలో ఏడుగురు గ‌ర్భిణులు ఉన్నార‌ని అందులో ఐదుగురికి కొవిడ్‌-19 పాజిటివ్ అని కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్ర‌హ్మదేవ్ రామ్ తివారీ ఆదివారం సాయంత్రం మీడియాతో వెల్ల‌డించారు. ఆశ్ర‌యం పొంద‌క ముందునుంచే ఈ బాలిక‌లు గ‌ర్భ‌వ‌తుల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పోక్సో చ‌ట్టం కింద ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. జిల్లా ఎస్పీ సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ గృహంలోకి పురుషులు వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

ఆశ్ర‌య గృహంలోని బాలిక‌లు కొన్ని రోజుల ముందు నుంచి కొవిడ్‌-19 ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. శుక్ర‌వారం ఈ విష‌యాన్ని స్థానిక అధికారులు వైద్య‌శాఖ‌కు తెలియ‌జేశారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో వైర‌స్ సోకింద‌ని తేలింది. గ‌ర్భిణుల్లో ముగ్గురిని రామ వైద్య క‌ళాశాల‌, ఇద్ద‌రిని హ‌లెట్ ఆస్ప‌త్రిలో చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు