
టీఎస్ ‘పది’ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులేనని... మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని వెల్లడించారు. గ్రేడ్లలో పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో ‘పది’ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.