కర్నల్‌ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ పరామర్శ

వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. గతంలో ప్రకటించిన విధంగా సంతోష్‌బాబు సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలు అందజేశారు. దీంతోపాటు రూ.ఐదు కోట్ల చెక్కు, నివాస స్థల

Updated : 24 Sep 2022 15:21 IST

సూర్యాపేట: వీరమరణం పొందిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల భారత్‌ - చైనా సరిహద్దు వద్ద గల్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్-1 ఉద్యోగం నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని అందించారు. సంతోష్ భార్యకు రూ.నాలుగు కోట్ల చెక్కు, తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.

దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణ త్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళ్లలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని