223 మంది ఏకకాలంలో వ్యాపారం చేసుకునేలా...

గత పాలకుల హయాంలో దండగగా మారిన వ్యవసాయాన్ని... పండగలా చేయాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో సుమారు రూ.ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన

Updated : 23 Jun 2020 17:51 IST

సిరిసిల్ల: గత పాలకుల హయాంలో దండగగా మారిన వ్యవసాయాన్ని... పండగలా చేయాలనేదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో సుమారు రూ.ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక రైతు బజారును మంత్రి ప్రారంభించారు. చిరువ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా బజారులో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ రైతులను మరువకుండా 5.6 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కేటీఆర్‌ అన్నారు.

‘‘సాగు, తాగు నీటి రంగంలో దేశం మొత్తం అబ్బురపడే విధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం నిర్మించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకోవడం, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ లాంటి దమ్ము, దక్షత ఉన్న నాయకుడు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. 223 మంది ఏకకాలంలో వ్యాపారం చేసుకునేలా ఈ రైతు బజారు నిర్మించాం. ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని