ఏపీలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. .......

Published : 24 Jun 2020 01:34 IST

అమరావతి: కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని