TS: రీకౌంటింగ్‌.. రీవెరిఫికేషన్‌ గడువు పెంపు

తెలంగాణలో ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు ఉపశమనం ఇచ్చింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం....

Updated : 24 Jun 2020 19:32 IST

ఇంటర్‌ బోర్డు నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు ఉపశమనం ఇచ్చింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత గురువారం తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలకు కలిసి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్‌ తొలి సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. 67.47 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 52.30 శాతం మంది పాసయ్యారు. రెండో సంవత్సర ఫలితాల్లో 2,83,462 మంది ఉత్తీర్ణత పొందగా, మొత్తం 68.86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని