Published : 25 Jun 2020 13:19 IST

ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

నర్సాపూర్‌: తెలంగాణలో ఆరోవిడత హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడే 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆకుపచ్చ తెలంగాణ సాధించడం, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం, రాష్ట్రాన్ని పర్యావరణహితంగా చేయడం హరితహారం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఐదు విడతలు పూర్తయ్యాయి. అటవీ, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, పురపాలక సహా దాదాపు 34 శాఖలు ఆరో విడతలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఏడాది 29.86 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని