అందుకే కరోనా వైరస్‌ నమూనాల సేకరణ నిలిపేశాం

ఈ నెల 16 నుంచి  ఇప్పటివరకు 36 వేల కరోనా వైరస్‌ నమూనాలు సేకరించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 8,253 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నమూనా సేకరించాక 48 గంటల లోపు పరిక్ష

Updated : 25 Jun 2020 20:37 IST

తెలంగాణ వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్‌: ఈ నెల 16 నుంచి  ఇప్పటివరకు 36 వేల కరోనా వైరస్‌ నమూనాలు సేకరించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 8,253 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నమూనా సేకరించాక 48 గంటల లోపు పరిక్ష చేయాల్సి ఉంది. అందుకే పెండింగ్‌లో ఉన్న నమూనాల ఫలితాలు వచ్చేంత వరకు కొత్త నమూనాల సేకరణ నిలిపివేశామని తెలిపింది. అయితే శిబిరాల్లో నమూనాల సేకరణ మాత్రమే నిలిపేశామని... కరోనా పరీక్షలు యథాతథంగా కోనసాగుతాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని