అచ్చెన్నాయుడిని రెండో రోజు ప్రశ్నిస్తున్న ఏసీబీ

ఈఎస్‌ఐ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. అనిశా  కేంద్ర పరిశోధన బృందం....

Published : 26 Jun 2020 13:41 IST

గుంటూరు: ఈఎస్‌ఐ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. అనిశా  కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు ప్రసాద్‌, చిరంజీవి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 6గంటల వరకు ఈ ప్రక్రియ సాగనుంది.
విచారణ ప్రారంభించటానికి ముందు అచ్చె్న్నాయుడికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ తర్వాత ప్రత్యేక వార్డుకు తరలించిన అధికారులు అక్కడే విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడితో పాటు ఆయన తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. నిన్న అచ్చెన్నాయుడిని 3గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయమని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని