‘పాలు’ మార్కెటింగ్‌ కోసం అముల్‌తో జట్టు

పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం అముల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. చక్కెర కర్మాగారాలు, పాడి పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు,

Published : 26 Jun 2020 17:11 IST

ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం అముల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. చక్కెర కర్మాగారాలు, పాడి పరిశ్రమపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంస్థ అనుభవం, సాంకేతికత, మార్కెటింగ్‌ను వినియోగించుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. సహకార రంగం బలోపేతం, రైతులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జులై 15లోగా అముల్‌తో అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. అముల్‌తో భాగస్వామ్యంపై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. పాడి రైతులను దోచుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం అన్నారు.  పశువులకు వైద్యం, సంరక్షణ, సాంకేతికత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సహకార చక్కెర కర్మాగారాల పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. పునరుద్ధరించాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంత్రులు, అధికారులు కలసి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రణాళికపై ప్రతిపాదనలు వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని