Published : 28 Jun 2020 01:06 IST

స్టాంప్‌ వేసిన మాంసాన్నే అమ్మాలి

జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ అధికారి అబ్దుల్‌ వఖీల్‌

హైదరాబాద్‌: జంతు వ‌ధ‌శాల‌లలో స్టాంప్ వేసిన మాంసాన్ని మాత్ర‌మే విక్ర‌యించాలని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నరీ అధికారి అబ్దుల్‌ వఖీల్‌ తెలిపారు. నగరంలో మాంసం అమ్మకం, వీధి కుక్కల నియంత్రణ చేపడుతున్న ప్రాజెక్టు తదితర వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘

చ‌ట్ట‌విరుద్దంగా సేక‌రించిన మాంసాన్ని విక్ర‌యిస్తున్న దుకాణాల‌ను గుర్తించి ఇప్పటికే హెచ్చ‌రించాం. అయిన‌ప్ప‌టికీ స్టాంప్‌లేని మేక‌, గొర్రె, గొడ్డు మాంసం అమ్మ‌కాన్ని కొన‌సాగిస్తున్నారు. స్టాంప్‌ లేని మేక‌, గొర్రె, గొడ్డు మాంసాన్ని విక్ర‌యించే దుకాణాల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. నిబంధ‌న‌లు పాటించ‌ని మాంసం దుకాణాల‌కు రేపు తుది నోటీసులు జారీచేస్తామని’’ అబ్దుల్‌ వఖీల్‌ చెప్పారు.

రెండు నెలల రోజుల పైలెట్‌ ప్రాజెక్టు...

‘‘న‌గ‌రంలో వీధి కుక్క‌ల నియంత్ర‌ణ‌కు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఐదు వార్డుల‌ను ఎంపిక చేశాం. ఈ నెల 15 నుంచి ఆగ‌స్టు 15 వ‌ర‌కు అమ‌లు చేస్తాం. హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లో నాగోల్-11 వార్డు, చార్మినార్ స‌ర్కిల్‌లో శాలిబండ-48 వార్డు, మెహిదీప‌ట్నం స‌ర్కిల్‌ అసీఫ్‌న‌గ‌ర్‌-72 వార్డు, శేరిలింగంప‌ల్లి-106 వార్డు, గాజుల‌రామారం -125 వార్డులో ఈ ప్రాజెక్ట్‌ అమ‌లు చేస్తున్నాం. ఈ ఐదు వార్డుల‌లో దాదాపు 20 వేల వీధి కుక్క‌లు ఉంటాయి.’’ అని అబ్దుల్‌ వఖీల్‌ తెలిపారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని