ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదో నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ...

Updated : 12 Sep 2023 16:12 IST

ఉంగుటూరు : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదో నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ట్యాంకర్‌ బోల్తాపడటంతో లీకైన పెట్రోల్‌ను పట్టుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. బకెట్లతో పెట్రోల్‌ తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు క్రేన్‌ సహాయంతో బోల్తాపడిన ట్యాంకర్‌ను యథాస్థితికి తెచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని