పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

Updated : 24 Sep 2022 15:21 IST

హైదరాబాద్‌: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఆదివారం నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా పీవీ చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని