వీకే సింగ్‌పై బదిలీ వేటు

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై  బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని  ఉన్నతాధికారులు ఆయన్ను ఆదేశించారు. 

Updated : 28 Jun 2020 18:50 IST

హైదరాబాద్‌ : తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆయన్ను ఆదేశించారు. పోలీస్ ఆకాడమీ సంచాలకులుగా.. పోలీసు రిక్రూట్‌మెంట్‌ ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 

గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వీకే సింగ్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. గాంధీ జయంతి రోజు పదవీ విరమణ పొందాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలల ముందుగానే నోటీసు ఇస్తున్నందున తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని