రైతు దినోత్సవంగా వైఎస్‌ఆర్‌ జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 29 Jun 2020 20:10 IST

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్యలు విప్లవాత్మకమైన‌వ‌ని తెలిపింది. ఆయన స్మారకంగా ఏటా జూలై 8న రైతు దినోత్సవంగా ప్రకటిస్తున్నట్టు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని