కరోనా లక్షణాలు కనిపించకపోతే..

కరోనా వైరస్‌ సోకినా లక్షణాలు అంతగా కనిపించకపోతే ఆనందంగానే ఉంటుంది. కానీ వీరిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనా అధ్యయనంలో తేలింది

Published : 30 Jun 2020 09:11 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ సోకినా లక్షణాలు అంతగా కనిపించకపోతే ఆనందంగానే ఉంటుంది. కానీ వీరిలో యాంటీబాడీలు త్వరగా క్షీణిస్తున్నట్టు చైనా అధ్యయనంలో తేలింది. జబ్బు నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత పరిశీలించగా.. కరోనా లక్షణాలు తలెత్తనివారిలో 40% మందిలో యాంటీబాడీల సంఖ్య గుర్తించలేని స్థాయికి పడిపోయింది. అదే లక్షణాలు కనిపించినవారిలో 13% మందిలోనే ఇలా జరగటం గమనార్హం. లక్షణాలు లేనివారిలో వాపు ప్రక్రియ నివారకాలుగా ఉపయోగపడే కణ సంకేత ప్రొటీన్ల సంఖ్యా తక్కువగా ఉండటం గమనార్హం. అంటే లక్షణాలు లేనివారిలో కరోనా వైరస్‌కు రోగనిరోధక ప్రతిస్పందన బలహీనంగా ఉందనే అర్థం. కొవిడ్‌-19 బారినపడ్డవారికి తిరిగి జబ్బు రాదనే భావనను అధ్యయన ఫలితాలు తిప్పికొడుతున్నాయి. ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం, ముప్పు ఎక్కువగా గలవారిని బయటకు రాకుండా చూడటం, పరీక్షలు ముమ్మరంగా చేయటం వంటి జాగ్రత్తలు దీర్ఘకాలం పాటించక తప్పదనే విషయాన్ని ఇవి చెప్పకనే చెబుతున్నాయి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని