Published : 01 Jul 2020 01:20 IST

క్వారంటైన్‌లో గొ‌ర్రెలు, మేక‌లు.. ఎందుకంటే? 

బెంగ‌ళూరు: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ధ‌నిక‌, పేద తేడా లేకుండా ప్ర‌తిఒక్క‌రినీ వెంటాడుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ గొర్రెల కాప‌రికి క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ కావ‌డంతో దాదాపు 50 గొర్రెలు, మేక‌ల‌ను క్వారంటైన్‌లో ఉంచిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది.

క‌ర్ణాట‌కలోని తుమ‌కూరు జిల్లా గొడెకెరె గ్రామంలో కొన్ని గొర్రెలు, మేక‌లు శ్వాస‌కోస స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు గ్రామస్తులు గ‌మ‌నించారు. అప్ప‌టికే గొర్రెల కాప‌రికి క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు గురైన స్థానికులు, వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఇదే విష‌యాన్ని క‌ర్ణాట‌క న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవ‌డంతో దీనిపై పూర్తి ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ప‌శుసంవ‌ర్ధ‌కశాఖ‌ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జంతువుల నుంచి న‌మూనాల‌ను సేక‌రించారు. పూర్తి ప‌రీక్ష‌ల కోసం శాంపిళ్ల‌ను భోపాల్‌లోని వెట‌ర్న‌రీ లేబొరేట‌రీకి పంపించారు. మేక ప్లేగు లేదా మైకో ప్లాస్మాగా పిలిచే 'పెస్టే డెస్ పెటిట్స్ రూమినాంట్స్‌(పీపీఆర్‌)'తో ఇవి బాధ‌పడుతున్న‌ట్లు ప‌శువైద్యులు అనుమానిస్తున్నారు.

అయితే, జంతువులకు క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌తిచోటా క‌రోనా భ‌యం ఉన్నందున ఈ జంతువులు కూడా క‌రోనా బారిన‌ప‌డ్డ‌ట్లు ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యార‌ని పేర్కొన్నారు. పీపీఆర్‌, మైకో ప్లాస్మా కూడా సంక్ర‌మిత వ్యాధులు కావ‌డం, మిగ‌తా జంతువుల‌కు సోక‌కుండా ముందుజాగ్ర‌త్తగా ఈ మేక‌ల‌ను నిర్బంధంలో ఉంచామని అధికారులు తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని