
పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కల్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారని పవన్ అన్నారు. ప్రజలు సాధారణ జీవనం సాగించాలని కోరుతూ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.