తెలంగాణలో కరోనా @ 24గంటల్లో 1018

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది.

Updated : 01 Jul 2020 22:22 IST

హైదరాబాద్‌: తెలంగాణలో  కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1018 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు మొత్తం 4234 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వాటిలో 1018 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 3216 నెగెటివ్‌గా తేలాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,357కి పెరిగింది. 

మరో ఏడుగురి మృతి
రాష్ట్రంలో కొత్తగా మరో ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 267కి పెరిగింది. అలాగే, ఈ రోజు 788 మంది కోలుకోవడంతో ఇప్పటివరకుడిశ్చార్జి అయిన వారి సంఖ్య 8082కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం  9008మంది చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్‌ వణుకుతోంది..
కరోనా కేసులు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో హైదరాబాద్‌ నగరం వణుకుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా మరో 881 కేసులు నమోదుకావడం కలవరం రేపుతోంది. అలాగే, రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 33, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1018 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే..  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని