దేవుడి ఆశీర్వాదం వల్లే మేం కోలుకున్నాం

దేవుడి ఆశీర్వాదంతోనే తాను, తన భార్య కరోనా నుంచి బతికి బయటపడ్డామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన వీహెచ్‌...

Published : 03 Jul 2020 02:18 IST

వీహెచ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: దేవుడి ఆశీర్వాదంతోనే తాను, తన భార్య కరోనా నుంచి బతికి బయటపడ్డామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన వీహెచ్‌ దంపతులు నిన్న  సాయంత్రం డిశ్ఛార్జి అయ్యారు. ఈ సందర్భంగా గురువారం వీహెచ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసేందుకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తానని వెల్లడించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పరుగు, పరుగున వెళ్లే తాను త్వరితగతిన కోలుకోవాలని ఎందరో ప్రార్థనలు చేశారన్నారు. వారందరి ప్రార్థనలు ఫలించడం వల్లే తామిద్దరం బయట పడగలిగామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడేందుకు తన వంతు కృషిచేస్తానని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని