హైదరాబాద్‌ ప్రజలు భయపడొద్దు: సీపీ

నగర ప్రజలు కరోనా వైరస్‌ విషయంలో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ నగరం ఎంతో సురక్షితమైందని పేర్కొన్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే...

Published : 04 Jul 2020 01:42 IST

హైదరాబాద్‌: నగర ప్రజలు కరోనా వైరస్‌ విషయంలో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ నగరం ఎంతో సురక్షితమైందని పేర్కొన్నారు. దిల్లీ, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే నగరంలో మరణాల సంఖ్య స్వల్పంగా ఉందని స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు తమ కర్తవ్యం నిర్వర్తించారని ప్రశంసించారు. ప్రజా శ్రేయస్సు విషయంలో పోలీసు శాఖ ఎంతో అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని