200వ రోజుకి చేరిన అమరావతి ఆందోళన

రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం..

Updated : 04 Jul 2020 11:40 IST

విజయవాడ: రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ ఆటోనగర్‌లోని ఐకాస కార్యాలయ వద్ద ఉద్యమంలో అమరులైన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమలో పలువురు ఐకాస నేతలు పాల్గొని రాజధాని పోరాటంలో మృతి చెందిన రైతులు, రైతు కూలీలకు నివాళులర్పించారు. రైతులకు మద్దతుగా మహిళలు కూడా దీక్షలు పాల్గొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఉద్యమాలు ఆగిపోయి, జనజీవనం స్తంభించినా అమరావతి ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. రైతులు ఎంతో పట్టుదలతో ఉద్యమం కొనసాగిస్తున్నార్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని సూచించారు. రాజధాని రైతులకు 13 జిల్లాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని వివరించారు. సీపీఎం నేత బాబూరావు, వివిధ పార్టీల నేతలు దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని