
Published : 04 Jul 2020 18:14 IST
ప్రభుత్వ విప్ సునీత భర్తకూ కరోనా పాజిటివ్
నల్గొండ: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరినీ వణికిస్తోంది. తాజాగా నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన భార్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతకు కరోనా సోకినట్టు వెల్లడైన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ నేపథ్యలో ఆమె భర్తకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే సునీత ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Tags :