వేడుకలు చేస్తే సమాచారమివ్వండి 

కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడొద్దు... సరైన ఆహారం, జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు అని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అన్నారు.

Published : 07 Jul 2020 03:53 IST

రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్‌: కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడొద్దు... సరైన ఆహారం, జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు అని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. కమిషనరేట్‌ పరిధిలో కొవిడ్‌ నుంచి కోలుకొని విధుల్లో చేరిన ఎనిమిది మంది సిబ్బందిని ఆయన ఘనంగా ఆహ్వానించి, సత్కరించారు. ‘‘కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోనా సోకింది.  అందులో ఎనిమిది మంది ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనాను జయించారు. మిగిలినవాళ్లు కోలుకుంటున్నారు’’ అని సీపీ చెప్పారు.  

‘‘కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మాస్క్ లేకపోతే ఫైన్‌ విధిస్తున్నామని మహేశ్‌ భగవత్‌ చెప్పారు. ఎవరైనా గుమిగూడి కార్యక్రమాలు చేస్తున్నా, వేడుకలు చేస్తున్నా సమాచారమివ్వండని సీపీ ప్రజలను కోరారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని