ఎల్జీ: 36 సైరన్‌ పాయింట్లున్నా.. పనిచేయలేదు

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నియమించిన హైపవర్‌  కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సమర్పించింది.

Updated : 06 Jul 2020 17:20 IST

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌లో అత్యవసర స్పందన వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. భద్రత, రసాయనాల నిల్వలో నిబంధనలు పాటించలేదు అని హైపవర్‌ కమిటీ ఛైర్మన్‌ నీరబ్‌ కుమార్‌ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్‌ ఘటనపై నియమించిన హైపవర్‌  కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటన తీరు, కారణాలపై కమిటీ విచారణ జరిపింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడిన నివేదికను హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌కు అందజేసింది. 

‘‘ఎల్జీ పరిశ్రమ ఎం-6 ట్యాంకు నుంచి ప్రమాదం జరిగింది. స్టైరీన్‌ ఆవిరి కావడంతో ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణం. సరైన ప్రమాద నివారణ, రక్షణ చర్యలు తీసుకోలేదు. ట్యాంకులు సహా ఇతర పరికరాల డిజైన్లలో లోపాలున్నాయి. భద్రత విషయంలో ఉద్యోగులకు అవగాహన లేనట్లు గుర్తించాం. స్టైరీన్‌ మిక్సింగ్‌ ట్యాంక్‌ పైపింగ్‌లో లోపాలున్నా మరమ్మతు చేయలేదు. లాక్‌డౌన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. కంపెనీలో 36 సైరన్‌ పాయింట్లు ఉన్నాయి, అయితే ఎక్కడా ఆ వ్యవస్థ పని చేయలేదు. ప్రమాద సమయంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడం పెద్ద తప్పిదం. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని