‘‘ఆ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారు’’

కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది...

Published : 07 Jul 2020 14:16 IST

తెలంగాణ హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌: కరోనా చికిత్సలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది శ్రీకిషన్‌ శర్మ  పిల్‌ వేశారు. కరోనా చికిత్సలు, ఛార్జీల్లో పారదర్శకతపై ప్రైవేటు ఆస్పత్రులకు మర్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. కరోనా చికిత్సలకు ఎంత చార్జీ తీసుకోవాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమని హైకోర్టు అభిప్రాయపడింది.

‘‘జీవో ఉల్లంఘించిన ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని భావిస్తున్నాం. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలపాలి’’ అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బిల్లు చెల్లించలేదని డీఎంఓను డిశ్చార్జ్ చేయని ఆస్పత్రిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు కోరింది.  ఈ నెల 14లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని