...ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే: ఆళ్ల నాని

‘‘ప్రైవేటు ల్యాబుల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తెలిసింది. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్‌ రద్దు చేయడానికి వెనుకాడం’’ ...

Published : 07 Jul 2020 14:30 IST

కరోనా బాధితులతో మాట్లాడిన ఏపీ మంత్రి

విజయవాడ: ‘‘ప్రైవేటు ల్యాబుల్లో ఒకట్రెండు ఫలితాలు తప్పుగా వచ్చినట్లు తెలిసింది. మరోసారి తప్పుడు రిపోర్టు వస్తే లైసెన్స్‌ రద్దు చేయడానికి వెనుకాడం’’ అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా బాధితులతో మంత్రి మాట్లాడారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య చికిత్సపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై కొవిడ్‌ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. 

ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని వైద్యులను మంత్రి నాని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘‘ఒక్కో కరోనా బాధితుడి ఆహారానికి రూ. 500 కేటాయించాం. ఆహార సరఫరాలో అవినీతి చేస్తే గుత్తేదారులను వెంటనే తొలగిస్తాం. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం నిజమే’’అని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు