ఏపీలో కరోనా: కొత్తగా 1,178 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి...

Updated : 07 Jul 2020 15:03 IST

వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 1,155 మంది, ఇతర ప్రాంతాల నుంచి వారు 23 మందికి సోకినట్లు పేర్కొంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 21,197కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 11,200 మంది చికిత్స పొందుతుండగా.. 9,745 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌తో ఇవాళ ఒక్క రోజే 13 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌తో కర్నూలులో 4, అనంతపురం 3, చిత్తూరు, విశాఖపట్నంలో ఇద్దరేసి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 16,238 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వివరాలు...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని