గ్యాస్‌ లీకేజీ ఘటనలపై ఎన్జీటీ కమిటీలు...​​​​​​​

విశాఖపట్నంలోని పరవాడ, కర్నూలు నంద్యాలలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కమిటీలు ఏర్పాటు చేసింది.

Published : 07 Jul 2020 19:34 IST

దిల్లీ:  విశాఖపట్నంలోని పరవాడ, కర్నూలు నంద్యాలలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కమిటీలు ఏర్పాటు చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్ (ఆయా), ప్రొ. రామచంద్రమూర్తి, ప్రొ. పులిపాటి కింగ్‌తో కమిటీలు నియమించింది. ఈ కమిటీలు విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి నష్ట పరిహారం అంచనా, భవిష్యత్ భద్రతా సూచనలతో నివేదిక రూపొందించాలని ఆదేశించింది. 

విశాఖపట్నంలోని పరవాడ గ్యాస్‌ లీకేజీ ఘటనకు బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ‘‘మృతులకు కంపెనీ ప్రకటించిన రూ. 35 లక్షల పరిహారం చెల్లించాలి. గాయపడిన నలుగురికి మధ్యంతర పరిహారంగా రూ.ఐదు లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలి.  అస్వస్థతకు గురైన నలుగురికి జిల్లా కలెక్టర్‌ ఆ నగదు ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఆదేశించింది.

నంద్యాలలోని ఆగ్రో ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ బాధిత మృతుల కుటుంబానికి రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ. ఐదు లక్షల చొప్పున మధ్యంతర పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. పరవాడ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ కూడా వర్తిస్తాయని ఎన్జీటీ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని