
వైఎస్‌ఆర్ సేవలను మరువలేం: ఉత్తమ్
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరెన్నికగన్న నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలను ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని కొనియాడారు. వైఎస్‌ఆర్ 71వ జయంతి వేడుకలను పంజాగుట్టలో ఘనంగా
నిర్వహించారు. పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాదవ్, వంశీచందర్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వీరితోపాటు ఏపీ మంత్రి అనికుల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్ కూడా
ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా వైఎస్‌ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. రైతులకు ,యువతకు, విద్యార్థులకు, మహిళలకు దివంగత నేత వైఎస్‌ఆర్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.