ఇప్పుడే ఏపీ గవర్నర్‌కు సూచించలేం: సుప్రీం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేశ్‌ పునర్‌నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో...

Updated : 08 Jul 2020 15:29 IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్ నియామకం కేసు
విచారణ మూడు వారాలు వాయిదా

దిల్లీ: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ పునర్‌నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ‘హైకోర్టు ఆదేశాలతో గతంలోని అధికారులూ విధులు నిర్వర్తించలేక పోతున్నారు. మధ్యంతరంగా ఎస్‌ఈసీని నియమించేలా గవర్నర్‌కు సూచించాలి’ అని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘గవర్నర్‌కు ఇప్పుడు సూచన చేయలేం. రెండు నుంచి మూడు వారాల్లో విచారణ ముగించాలని భావిస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలచుకోలేదు’ అని సీజేఐ జస్టిస్ బొంబ్డే స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పునర్‌నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించగా.. 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని