లైవ్‌ డాష్ బోర్డులు ఏర్పాటు చేయండి: హైకోర్టు

ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం కోసం లైవ్ డాష్ బోర్థులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 09 Jul 2020 01:22 IST

హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం కోసం లైవ్ డాష్ బోర్థులు ఏర్పాటు చేయాలని హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది గణేష్ కర్నాటి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే లైవ్ డాష్ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేస్తోందని ఏజీ న్యాయస్థానానికి తెలియజేశారు. దిల్లీలో ఇప్పటికే లైవ్ డాష్ బోర్డులు ఏర్పాటు చేశారన్న హైకోర్టు చెప్పింది. దిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి సాఫ్ట్‌వేర్‌, సాంకేతిక పరిజ్ఞానం కోరాలని హైకోర్టు సూచించింది. అనంతరం విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని