అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత

త్రైత సిద్ధాంతకర్తగా పేరు తెచ్చుకున్న ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్యంతో ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు.

Updated : 09 Jul 2020 16:09 IST

తాడిపత్రి: త్రైత సిద్ధాంతకర్తగా పేరు తెచ్చుకున్న ప్రబోధానంద కన్నుమూశారు. అనారోగ్యంతో ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు, భక్తులు తాడిపత్రి ఆశ్రమానికి తరలిస్తున్నారు. తాడిపత్రి మండలంలోని చిన్నపొడమల కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ప్రబోధానంద ఆశ్రమాన్ని నెలకొల్పారు. దీంతోపాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ మందిరం, ఇందూ జ్ఞానవేదికలను కూడా స్థాపించారు.  భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌లో ఉన్న దైవజ్ఞానం ఒక్కటే అని ప్రబోధానంద ప్రచారం చేసేవారు. త్రైత సిద్ధాంతం పేరుతో ఆయన అనేక పుస్తకాలు రాశారు. అయితే వివాదాస్పద బోధనలు, అభిప్రాయాల వల్ల ప్రబోధానందపై విమర్శలు వచ్చాయి. 2018లో జేసీతో విభేదాల వల్ల ఆశ్రమవాసులు, స్థానికుల మద్య ఘర్షణ నెలకొంది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts