పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: కేటీఆర్‌

గత ఆరేళ్లుగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు.

Published : 10 Jul 2020 01:17 IST

హైదరాబాద్‌: గత ఆరేళ్లుగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. యూఎస్‌ ఐబీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్‌ కంపెనీల అధినేతలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగాలకు బలమైన వ్యవస్థ ఉందని,  ప్రస్తుతం చాలా దేశాలు హైదరాబాద్‌ కంపెనీల ఔషధాలపై  
ఆధారపడ్డాయని కేటీఆర్‌ చెప్పారు.తెలంగాణలో పెట్టుబడుల వాతావరణాన్ని అమెరికన్‌ కంపెనీలు ప్రశంసించాయి. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని అమెరికన్‌ కంపెనీల అధినేతలు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని