కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్‌ ఓవైసీ

సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ

Published : 10 Jul 2020 15:25 IST

హైదరాబాద్‌: సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న క్రమంలో దెబ్బతిన్న ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చులతో మళ్లీ నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్వాగతించారు. యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామన్నారు.భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి కొంతనష్టం జరిగిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నానని, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు ఎన్ని కోట్లయినా వెనకాడకుండా ఆలయం, మసీదులను విశాలంగా తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమై కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని