ఆలయ చరిత్రలో మొదటిసారి: తలసాని

ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర

Published : 11 Jul 2020 10:27 IST

ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘అధికారులు, అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తాం. ఆలయ చరిత్రలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలి. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దు’’అని మంత్రి తలసాని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని