‘నిర్లక్ష్యం వల్ల 27 వేల నమూనాలు వృథా’

కొవిడ్‌ నమూనాల సేకరణ తీరుపై అధికారులపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో 27వేల నమూనాలు పనికి రాకుండా పోయాయని చెప్పారు. సేకరించిన కొవిడ్‌..

Published : 11 Jul 2020 21:25 IST

అధికారులపై ప్రకాశం జిల్లా కలెక్టర్ అసహనం

ఒంగోలు: కొవిడ్‌ నమూనాల సేకరణ తీరుపై అధికారులపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతో 27వేల నమూనాలు పనికి రాకుండా పోయాయని చెప్పారు. సేకరించిన కొవిడ్‌ నమూనాలకు ఐడీ నంబర్లు వేయలేదన్నారు. మూతలు లేకుండా నమూనాలు పంపినందుకు తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమూనాలు సేకరించాలని ఆదేశించారు. మండల, నియోజకవర్గ అధికారులు పాఠాలు చెప్పించుకునే స్థాయికి దిగజారారని అసహనం వ్యక్తం చేశారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది తప్పిదాలను ఉపేక్షించేదిలేదని కలెక్టర్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని