
ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాల భర్తీ
ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్: : లాలాగూడలోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్ కొవిడ్-19 వార్డులకు సిబ్బంది నియామకానికి దక్షిణమధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.9 మంది స్పెషలిస్టు వైద్యులు, 16జీడీఎంఓలు, 31 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 4 ల్యాబ్ అసిస్టెంట్లు, 50 మంది ఆసుపత్రి అంటెండెంట్ల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు జులై 15 తుది గడువుగా ప్రకటించారు. వీడియోకాల్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని వెల్లడించింది.వివరాల కోసం తమ వెబ్ చిరునామా www.scr.indianrailways.gov.in చూడాలని రైల్వేశాఖ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.