విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. వీడియోలు వైరల్‌

నిజాంపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటర్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి తీసిన వీడియోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో

Updated : 12 Jul 2020 09:43 IST

నిజాంపట్నం, న్యూస్‌టుడే: నిజాంపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటర్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి తీసిన వీడియోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే, కారకుడు ఎక్కడా ఆనవాళ్లు కనిపించకుండా చిత్రీకరించాడు. ఈ ఘటనపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోలు పోస్టయిన వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని చెప్పామని ఎస్సై హరిబాబు తెలిపారు. ఆ వీడియోలు తీసిన వ్యక్తి ప్రైవేట్‌ ఉపాధ్యాయుడని, తన గ్రామంలో అధికార పార్టీ కీలక కార్యకర్తగా వ్యవహరిస్తుంటాడని, గతంలోనూ అతడు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని