భక్తులు లేకుండానే మహంకాళికి తొలి బోనం

అంగరంగవైభవంగా నిర్వహించాల్సిన హైదరాబాద్‌ బోనాలు కరోనా కారణంగా ఈ సారి వెలవెలబోతున్నాయి. భక్తులు లేకుండానే ఇవాళ ఉదయం మహంకాళికి

Published : 12 Jul 2020 14:14 IST

హైదరాబాద్‌: అంగరంగవైభవంగా నిర్వహించాల్సిన హైదరాబాద్‌ బోనాలు కరోనా కారణంగా ఈ సారి వెలవెలబోతున్నాయి. భక్తులు లేకుండానే ఇవాళ ఉదయం మహంకాళికి తొలి బోనం సమర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భక్తులు లేకుండానే ఉజ్జయిని మహంకాళి బోనాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని, 
అయితే, సంప్రదాయ పూజలన్నీ సజావుగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. బోనాల ఉత్సవాలను ప్రజలు ఇళ్లల్లోనే జరుపుకుంటున్నారని చెబుతూ.. స్వచ్ఛందంగా సహకరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చేవారం నిర్వహించబోయే లాల్‌దర్వాజా ఉత్సవాలు కూడా ఇలాగే జరుగుతాయని తలసాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని