‘కరోనా నియంత్రణలో తెరాస సర్కార్ నిర్లక్ష్యం’

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తెరాస ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతిపై ఆమె స్పందించారు.

Published : 13 Jul 2020 01:00 IST

 కేసీఆర్‌ వైఖరిపై మండిపడ్డ విజయశాంతి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తెరాస ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతిపై ఆమె స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరితో ప్రాణాలను సైతం తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది అవమానాల పాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టింగ్‌లు, అనుభవం, జీతాల విషయంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక తెరాస సర్కార్‌ నీళ్లు నములుతోందన్నారు. ఆర్టీసీ సిబ్బందికి జూన్‌ నెల అందిన జీతాలు చూస్తే వారికి ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుస్తుందని విజయశాంతి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం కేసీఆర్ ఎప్పుడు ఫాం హౌస్‌లో ఉంటారో.. ఎప్పుడు ప్రగతి భవన్‌లో దర్శనమిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని