రష్యా వ్యాక్సిన్‌.. క్లినికల్‌ ట్రయల్స్‌ ఎలాగంటే?

కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ప్రయోగాలు విజయవంతంగా  పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్‌ ఫస్ట్‌ మాస్కో స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ’ నిన్న ప్రకటించిన విషయంతెలిసిందే.

Updated : 13 Jul 2020 16:45 IST

మాస్కో: కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ప్రయోగాలు విజయవంతంగా  పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్‌ ఫస్ట్‌ మాస్కో స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ’ నిన్న ప్రకటించిన విషయం
తెలిసిందే. ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలిటీకా తమదేనని వెల్లడించింది. 

రష్యాలోని గమేలెయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాపై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది.ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందం బుధవారం, రెండో బృందం ఈ నెల 20న డిశ్చార్జి అవుతారని వివరించింది.  ఈ పరీక్షలు జూన్‌ 18న ప్రారంభమయ్యాయి.

క్లినికల్‌ ట్రయల్స్‌ను ఏ విధంగా చేపట్టారంటే..
>జూన్‌18న ఆరోగ్యవంతులైన 18 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు.
> 20 మందితో కూడిన రెండో బృందంపై జూన్‌ 23న ‘ప్రాక్టికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్జియోవాసాలజీ’లో వ్యాక్సిన్‌ ప్రయోగించారు.
> వాలంటీర్లంతా 18 నుంచి 65 ఏళ్లలోపు వారు. పొడి రూపం నుంచి ఇంజక్షన్‌ రూపొందించి వీరికి ఇచ్చారు.
> వ్యాక్సిన్‌ ఇచ్చిన అనంతరం తలనొప్పి, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటివి కనిపించినట్లు పలువురు పేర్కొన్నారు. అయితే 24 గంటల్లోనే ఇవి పరిష్కారమయ్యాయని
నిర్వాహకులు తెలిపారు.
> ప్రయోగాల్లో పాల్గొన్న వాలంటీర్లను సెచెనోవ్‌ యూనివర్సిటీలోని క్యాంపస్‌లో సింగిల్‌, డబుల్‌ వార్డుల్లో ఉంచారు.
> టీకా ఇచ్చిన అనంతరం వారు 28 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. డిశ్చార్జి అయిన తర్వాత 6 నెలలపాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు.
> ఐసోలేషన్‌ సమయంలో వాలంటీర్లకు మానసికపరమైన తోడ్పాటును కూడా సంస్థ అందిస్తోంది.
> గమేలియా ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను మాస్కోలోని బర్డెన్‌కో మిలటరీ ఆస్పత్రిలో కూడా పరీక్షించారు. ద్రవ రూపంలోని మందును ఇక్కడ వాలంటీర్లకు
ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని