ఆ ₹50 కోట్లు మార్పిడి చేయండి: వైవీ

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను తితిదే వైవీ సుబ్బారెడ్డి కోరారు.

Updated : 13 Jul 2020 18:19 IST

దిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను తితిదే వైవీ సుబ్బారెడ్డి కోరారు. నిర్మలా సీతారామన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు దిల్లీలో కలిశారు. నోట్ల రద్దుతో సుమారు ₹ 50 కోట్ల పాత నోట్లు తితిదేలో ఉండిపోయాయని సుబ్బారెడ్డి ఆర్థికమంత్రికి తెలిపారు. నోట్ల రద్దు సమయంలో భక్తులు కానుకలుగా ఇచ్చిన ఆ డబ్బును మార్చాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని