‘పాన్‌ మసాలా’కోసం ఆరాటం, కొవిడ్‌ రోగి పరారి..!

ఓవైపు కరోనా వైరస్‌ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్‌మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి‌ నుంచే తప్పించుకున్నాడు. పాన్‌షాప్‌కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.

Published : 14 Jul 2020 21:48 IST

ఆగ్రా: ఓవైపు కరోనా వైరస్‌ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్‌మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి‌ నుంచే తప్పించుకున్నాడు. పాన్‌షాప్‌కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.

ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో అధికారులు అతన్ని స్థానిక ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీలో చేర్పించారు. అనంతరం కొవిడ్‌ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అయితే, ఆ వ్యక్తికి పాన్‌ మసాలా తినడం అలవాటు ఉండడంతో ఆసుపత్రి ప్రాంగణంలో వెతికాడు. ఎక్కడా దొరక్కపోవడంతో ఆసుపత్రి నుంచి తప్పించుకొని కొంతదూరంలో ఉన్న పాన్‌షాపుకు వెళ్లాడు. పాన్‌ తిన్న తర్వత మరికొన్ని పాన్‌లను పార్శిల్‌ తీసుకొని జేబులో వేసుకున్నాడు. అనంతరం అక్కడ నుంచి తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే ఆసుపత్రి సిబ్బంది అతనికోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు ఆ రోగి అతని స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అయితే, ఆ వ్యక్తికి వైరస్‌ సోకిందనే విషయం ఆ కుటుంబ సభ్యులకు తెలియదని అధికారులు వెల్లడించారు. 

కేవలం పాన్‌మసాలా కోసమే ఆ వ్యక్తి బయటకు వెళ్లాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతని కదలికపై గట్టి నిఘా పెట్టామని, అతని మానసిక పరిస్థితిపై కూడా దృష్టి సారించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 9లక్షలు దాటిన కరోనా కేసులు..

బ్రిటన్‌ వాసులకు శీతాకాలం ముప్పు..!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు