కరోనాకు ‘కోటింగ్‌’ పడుద్ది

కరోనా వైరస్‌ వస్తువుల ఉపరితలాలపైన 24 గంటలవరకూ జీవించి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి...

Updated : 16 Jul 2020 09:23 IST

టొరంటో: కరోనా వైరస్‌ వస్తువుల ఉపరితలాలపైన 24 గంటలవరకూ జీవించి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో తలుపు గడియలు, స్విచ్‌లు, సెల్‌ ఫోన్లు.. ఇలా ఏ వస్తువును పట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి. అయితే ఆ భయానికి ‘కోటింగ్‌’తో టాటా చెప్పే దిశగా పరిశోధన జరుగుతోంది. కరోనా వైరస్‌ చేరితే వెంటనే దాన్ని చంపేసేలా వస్తువులకు పూసే యాంటీ వైరల్‌ పూతను(కోటింగ్‌) తయారు చేసే దిశగా కెనెడాలోని వాటర్‌లూ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ నానో టెక్నాలజీ(విన్‌) ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ సుశాంత మిత్ర దీని గురించి వివరిస్తూ ‘‘కరోనాపై ముందుండి పోరాడుతున్న సిబ్బందికి, సాధారణ ప్రజలకూ రక్షణ కల్పించేలా, సామూహిక వ్యాప్తిని అరికట్టేలా ఈ కోటింగ్‌ పనిచేయనుంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని