21 రోజుల్లో యాంటీబాడీల అభివృద్ధి

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో పురోగతి. ఔషధ దిగ్గజం ఫైజర్‌-జర్మనీ బయోటెక్‌ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్‌.....

Updated : 08 Nov 2021 22:27 IST

ఫైజర్‌-బయాన్‌టెక్‌ వ్యాక్సిన్‌తో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

న్యూయార్క్‌: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మరో పురోగతి. ఔషధ దిగ్గజం ఫైజర్‌-జర్మనీ బయోటెక్‌ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్‌... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది. తొలిదశ క్లినికల్‌ ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చినట్టు జర్నల్‌ నేచర్‌ పత్రిక పేర్కొంది. పరిశోధకులు రోగనిరోధక శక్తిని ప్రతిస్పందింపజేసే ‘బీఎన్‌టీ162బీ1’ అనే ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. దీనిలోని కీలక పదార్థం... కరోనా రిసిప్టర్‌-డొమైన్‌లో భాగమయ్యే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా జీవకణాలను అనుమతిస్తుంది. మరోవైపు, దీని ఆధారంగా యాంటీబాడీలను విడుదల చేసేలా రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా 18-55 ఏళ్ల వయసున్న 45 మంది ఆరోగ్యవంతులకు దీన్ని ఇచ్చారు. సింగిల్‌ డోసుతోనే వారిలో 21 రోజుల్లోనే యాంటీబాడీలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని