పిల్లల రోగనిరోధక వ్యవస్థపై కొవిడ్‌ ప్రభావం

కొవిడ్‌-19 సోకిన పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ ఎలాంటి మార్పులకు గురవుతున్నదీ లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌ బారిన పడిన కొందరు పిల్లల్లో.. ‘పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్లమేటరీ ..

Published : 20 Aug 2020 09:45 IST

లండన్‌: కొవిడ్‌-19 సోకిన పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ ఎలాంటి మార్పులకు గురవుతున్నదీ లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌ బారిన పడిన కొందరు పిల్లల్లో.. ‘పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌(పీఐఎంఎస్‌-టీఎస్‌)’ అనే అరుదైన సమస్య తలెత్తుతోందని  అధ్యయనం పేర్కొంది. నేచర్‌ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు. కొవిడ్‌తో పిల్లల రక్తనాళాల్లో వాపు పెరిగిపోయి గుండె పనితీరుపై పడుతోందని చెప్పారు. అధ్యయనంలో భాగంగా.. 25 మంది కరోనా పాజిటివ్‌ పిల్లల రక్త నమూనాలను విశ్లేషించారు. వారిలో కొవిడ్‌ లక్షణాలతో పాటు పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాలు కనిపించాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్న పిల్లల నమూనాలనూ సేకరించారు. వీరందరి ఫలితాలను ఆరోగ్యంగా ఉన్న మరో ఏడుగురు పిల్లల ఫలితాలతో పోల్చి చూశారు. పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాలున్న పిల్లల్లో సైకోటైన్లు పెరిగిపోయి రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన లింఫోసైట్లు(తెల్ల రక్తకణాలు) తగ్గిపోతున్నాయని గుర్తించారు. వారి రోగనిరోధక వ్యవస్థలో జరిగే మార్పులు సైతం సంక్లిష్టంగా ఉన్నాయి. ఒకరకంగా శరీరం అంతటా రక్తనాళాలు ఎర్రబడే ‘కవసాకి’ వ్యాధి తరహాలో ఈ లక్షణాలు ఉంటాయని చెప్పారు. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్నాక.. పిల్లల రోగ నిరోధక వ్యవస్థ కూడా క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని వివరించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts