స్వాతి లక్రా పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్వాతిలక్రా పేరిట సైబర్‌ కేటుగాళ్లు పలువుర్ని బోల్తా కొట్టించేందుకు యత్నించారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించి

Updated : 22 Sep 2020 09:04 IST

డబ్బులు పంపించాలంటూ సైబర్‌ దొంగల వినతులు

 హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్వాతిలక్రా పేరిట సైబర్‌ కేటుగాళ్లు పలువుర్ని బోల్తా కొట్టించేందుకు యత్నించారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించి డబ్బులు పంపించాలని, ఒకటి రెండురోజుల్లో సర్దుబాటు చేస్తానంటూ స్నేహితులు, బంధువులు, పోలీస్‌ అధికారులకు అభ్యర్థన పంపారు. కొందరు అధికారులు సోమవారం ఈ విషయాన్ని స్వాతిలక్రా దృష్టికి తెచ్చారు. వెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. ‘‘నేను ఎవర్నీ డబ్బులు అడగలేదంటూ’’ తన అధికారిక ఖాతాలో వివరణ ఇచ్చారు. కొన్ని నిమిషాల తర్వాత సైబర్‌ దొంగలు నకిలీఖాతాను తొలగించడం గమనార్హం. సైబర్‌ క్రైం పోలీసులకు స్వాతిలక్రా ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 50 మంది పోలీస్‌ అధికారుల పేరిట నకిలీ ఖాతాలను సైబర్‌ దొంగలు సృష్టించినట్లు సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ (క్రైమ్స్‌) కవిత వివరించారు. ఒడిశా, రాజస్థాన్‌ నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇలాంటి అభ్యర్థనలు నమ్మవద్దని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని